Tuesday, November 18, 2008

Evil ways?

Evil ways?

http://telugukavitaluvasili.blogspot.com/2008/11/blog-post.html

bhavani said...

నేను నా తొమ్మిదో తరగతి నుండీ చర్చికి వెళ్ళటం
ప్రారంభించాను. అక్కడ పాటలూ, మాటలూ నాకర్ధమయ్యేవి మరి.
పీ.జీ కి వచ్చాక ఇంకొంచం ముందుకువెళ్ళి
ఒక ప్రేయర్ గ్రూపుతో కలిసి ప్రార్ధనలు కూడా చెయ్యటం మొదలుపెట్టాను.
రోజూ మంచి మంచి పాటలు పాడుతుంటే చాలా బాగా అనిపించేది.
ఆ ప్రేయర్ గ్రూపును ఒక ఆంటీ నిర్వహించేవారు. ఎంతో ప్రేమగా ఉండేవారు.
ఐతే రోజూ దేవుని గురించి అందరికీ చెప్పాలని చెప్పేవారు.
ఆ విషయాన్ని నేనంతగా పట్టించుకోలేదు.
ఇలా కొన్నాళ్ళు అయ్యాక ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక ప్రేయర్ క్యాంప్ ఎటెండ్ అయ్యాను.
ఆ క్యాంపులో ఎనిమిదో క్లాసూ, అంతకంటే పై తరగతి పిల్లలను ఉంచేశారు.
అందులో మొదటి రూలేంటంటే దేవుని యందు నమ్మకం లేని వారిని పెళ్ళిచేసుకోకూడదు
అని. దేవుని సేవకు ఫుల్ టైం అంకితమయ్యేవాళ్ళు రండి అని ఆహ్వానించారు.
కొంతమంది వెళ్ళారు. పార్ట్ టైం అంకితమయ్యేవాళ్ళు రండి అని ఆహ్వానించారు.
ఇంకొంతమంది వెళ్ళారు. నేనూ, ఇంకొక అమ్మాయే మిగిలిపోయాము.
మేము సాతాను ప్రభావంలో ఉన్నామని చెప్పారు.
దేవుడంటే బాగా నమ్మకమున్న రోజులవి.
నమ్మకం కంటే భయపడిన రోజులవి.
అందుకే కొన్నాళ్ళు చాలా భయపడ్డాను.
అందరికీ దేవుని గురించి ప్రచారం చెయ్యమని చెప్పేటప్పుడు,
మనసులో అది తప్పని పీకేసినా దేవుడెక్కడ ఆగ్రహిస్తాడోనని భయం.
ఈ ప్రసాదాలు తినకపోవటం, ఇంకొకరి దేవుళ్ళను పూజించకపోవటం
ఇలాంటి క్యాంపుల మరియూ ఆయా చర్చి సభ్యుల నుండి వచ్చే ప్రజర్ అని కచ్చితంగా చెప్పగలను.
మామూలుగా ప్రేయర్కి ఎటెండ్ అయ్యే వాళ్ళకి బాప్టిజం ప్రెజర్ కూడా ఎక్కువే.
ఒకమ్మాయి ఇంటి నుండి పారిపోయి వచ్చి చర్చిలో కొన్నాళ్ళు ఉంది. ఆ అమ్మాయి కేవలం క్రీస్తునే కొలవాలనుకుంది. ఇంటిలో వాళ్ళకు మింగుడుపడలేదు. అందుకే. దానిని దేవుని అద్బుతంగా చెప్పేవారు.
రామక్రిష్ణా మిషన్లో జెర్మన్ నేర్చుకునే నా క్లాస్మేట్ చర్చి పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు.
రెండు రోజులు వెళ్ళి మానేశాడు సాతాను ప్రభావానికి లోను కాకూడదని.
ఇప్పుడు ఇంకా ఆగ్రహానికి గురయ్యాడనుకోండి ఒక హిందూని ప్రేమించి.
ఆ అమ్మాయిని కూడా కన్వర్ట్ చేస్తానన్న పిదప ఊరుకున్నారు.
నేనూ ఈ విధంగానే ఆగ్రహానికి గురయ్యాక, ఏ దేవుణ్ణీ పూజించటం మానేశాను.
ఇప్పుడు నేను ఎగ్నాస్టిక్కూ కాదు, ఏతీస్టూ కాదు, తీఇస్టూ కాదు. మామూలు మనిషిని. అంతే.
అబ్రకదబ్రగారు చెప్పినట్లు అతను లౌక్యం తెలిసినవాడనుకోవచ్చు. అతను నాకు తెలిసిన వ్యక్తుల వంటి వాడో కాదో తెలీదు కానీ ఆ ప్రేయర్ గ్రూపులో దళితుల హక్కుల గురించి గొంతెత్తి పోరాడే కొందరు గొప్పోలు, మతాన్ని base చేసుకొని మిగతా వారిని discriminate చేసేవారు.

No comments: